Site icon NTV Telugu

Banakacherla: బనకచర్లపై కేబినెట్‌లో కీలక చర్చ.. మనం కౌంటర్‌ ఇవ్వాలి..!

Banakacherla

Banakacherla

Banakacherla: పోలవరం-బనకచర్లపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.. అయితే, ఏపీ కేబినెట్‌ సమావేశంలో బనకచర్లపై కీలక చర్చ సాగింది.. పోలవరం బనకచర్ల పై తెలంగాణ వాళ్లు అందరూ మాట్లాడుతున్నారు.. నిన్న తెలంగాణ కేబినెట్‌లో వాళ్లు డిస్కస్ చేశారు.. మనం కూడా మన వాదన వినిపించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. వాళ్లు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారు.. ఇంకా, అనేక ప్రాజెక్టులు కడుతున్నారు.. వాళ్లు వాడుకోగా మిగిలిన నీళ్లు కదా మనం వాడుకొనేది అన్నారు సీఎం చంద్రబాబు.. మనం వరద జలాలను కదా వాడుకుంటమనేదన్న సీఎం చంద్రబాబు.. దీనిపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో.. మనం చెప్పాలని మంత్రులకు సూచించారు..

Read Also: Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ?

ప్రాజెక్టులపై వాళ్లు (తెలంగాణ) రాజకీయం చేస్తున్నారు… మనం ప్రాజెక్ట్ మీద జనానికి బాగా అర్థమయ్యే రీతిలో చెబితే బాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, CRDA పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వం భూములు 2019కు ముందు 6 ఏళ్లు అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్ట పరిహారం ఇవ్వాలి అన్నారు సీఎం.. జిల్లా స్థాయిలో ఏడాది పాలన పై జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి సమావేశం పెట్టాలి.. నియోజకవర్గ స్థాయిలో MLA ఇటువంటి సమావేశం ఏర్పాటు ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి అని ఆదేశించారు.. జులై 1 నుంచి ఏడాది పాలన పై MLA లు ఇంటింటికి తిరిగి చెప్పాలి.. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని వెళ్లాలని కోరారు చంద్రబాబు..రెవెన్యూ సమస్యలు అన్ని ఏడాది లోపు సమస్యలు అన్ని పరిష్కరించాలని స్పష్టం చేశారు.. ఎక్కువగా రెవెన్యూపై మనకు సమస్యలు వస్తున్నాయి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version