NTV Telugu Site icon

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..

Konetiadimulam

Konetiadimulam

MLA Adimulam case: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదుచేసిన తెలుగు మహిళా నాయకురాలు బుధవారం మరోసారి తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. వైద్య పరీక్షలకు ఒప్పుకుని ప్రసూతి ఆస్పత్రిలో జాయినయ్యారు. సోమవారం ఉదయం భర్తతో కలసి స్టేషన్‌కు వచ్చిన ఆమె కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకాలేనని తేల్చి చెప్పారు. దీంతో సీఐ మహేశ్వర్‌రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వచ్చిన ఆమె వైద్య పరీక్షలను రుయాస్పత్రిలో కాకుండా ప్రసూతి ఆస్పత్రిలో చేయించుకుంటానడంతో పోలీసుల సహకారంతో ఆమె బుధవారం మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం జాయినయ్యారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆమె వచ్చిందన్నారు పోలీసులు..

Read Also: Ganesh Nimajjanam 2024: వరుసగా రెండో రోజూ నిలిచిన గణేష్‌ నిమజ్జనాలు.. విగ్రహాలు వెనక్కి పంపుతున్న పోలీసులు..

మరోవైపు.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు.. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించడం లేదు కుటుంబ సభ్యులు.. సెక్యూరిటీ సిబ్బంది.. ఇప్పటికే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచారం కేసులో తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది.. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ లో ప్రస్తావించారు.. ఇక, బాధితురాలు కూడా వైద్య పరీక్షలు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటికే తిరుపతిలోని బీమాస్ పేరడైజ్ లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూమ్‌లు సీజ్ చేశారు.. సీసీ టీవీ ఫుటేజ్‌ ను సైతం స్వాధీనం చేసుకున్నారు.. మరోవైపు.. అశ్లీల వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. టీడీపీ ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం విదితమే.