Site icon NTV Telugu

AP High Court: వైఎస్‌ జగన్‌ భద్రతపై పిటిషన్‌.. హైకోర్టులో కీలక వాదనలు

Ap High Court Ys Jagan

Ap High Court Ys Jagan

AP High Court: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. జగన్ నెల్లూరు పర్యటనలో హెలిపాడ్‌ అనుమతి పిటిషన్‌ కూడా దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు మాజీ ఏజీ శ్రీరాం.. హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్‌ వేసిన వెంటనే హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఇదే హెలిప్యాడ్‌ అన్నారు. హెలిప్యాడ్‌కోసం సూచించిన స్థలంలో మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉందని.. తుప్పలు, డొంకలు ఉన్నాయి.. హెలిప్యాడ్‌ కోసం సిద్ధం చేయాలంటే మూడు నాలుగు రోజులు పట్టేలా ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు..

Read Also: South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?

ఇక, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్ విషయంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్రం పాటించడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.. పర్యటనల సమయంలో రోప్‌ పార్టీలు కూడా ఇవ్వడం లేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్‌ చేయడానికి రోప్‌ పార్టీలు అత్యంత అవసరం.. కానీ, రోప్‌ పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడు మూతలు ఆడుతుందో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్‌పార్టీలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు.. జగన్ కు సేఫ్‌ ల్యాండింగ్‌, సేఫ్‌ ట్రావెల్‌, సేఫ్‌ మూవ్‌ అన్నది కల్పించాల్సిన అవసరం ఉంది.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.. జగన్ కి భద్రత పెంపుపై గతంలో వేసిన 2 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అయితే, నిరర్థకమైన విషయంలో పిటిషన్‌ ఫైల్‌ చేశారంటూ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.. జడ్‌ ప్లస్‌ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని హైకోర్టుకు తెలిపారు.. రోప్‌ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రీరాం వాదనలు వినిపించారు. ఇక, వచ్చే బుధవారం వరకూ వాయిదా కోరారు ఏజీ.. దీంతో, వచ్చే బుధవారానికి విచారణ వాయిదా వేశారు న్యాయమూర్తి.. కాగా, వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్న విషయం విదితమే..

Exit mobile version