NTV Telugu Site icon

Janasena Party: జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్

Janasena

Janasena

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు అధికారాన్ని చలాయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఈ రోజు జనసేన పార్టీలో చేరారు వైసీపీ నేతలు.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.. వారికి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఈ మధ్యే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.. మరోవైపు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, శ్రీమతి రాధని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్‌ కల్యాణ్‌.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరలు పాల్గొన్నారు.

Read Also: Sankranthiki Vasthunam: వెంకీ మామ తగ్గట్లేదు.. మరో సాంగ్ వదిలాడు!

 

 

 

 

 

Show comments