Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం అవుతుంది.. ఓవైపు ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై ఫోకస్ పెడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు.. ఇక, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నాహాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల సమాచారాన్ని సేకరించి, ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడికి నివేదించే బాధ్యతను ఈ కమిటీ నిర్వహించనుంది.
ఈ కమిటీలో APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ పనిచేస్తోంది. తాజాగా నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆ 14 మంది సభ్యుల సమన్వయ కమిటీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనిచేయనుంది. గతంలో ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని పార్టీ అధ్యక్షుడు సూచించినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి ఐదు మంది సభ్యులతో కమిటీ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీతో సమన్వయం చేయడంతో పాటు, సేకరించిన… pic.twitter.com/TwXwNzIWOK
— JanaSena Party (@JanaSenaParty) September 24, 2026

