YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోన్న సమయంలో.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని పార్టీ సంస్థాగత పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, వైసీపీని మరింత బలోపేతం చేయడం, నేతలు-కార్యకర్తలను ప్రజలకు చేరువ చేయడం వంటి అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ, దాని ప్రభావం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపైనా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, నాయకుల సమన్వయం, ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే అంశాలపై జగన్ నేతలకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, స్థానిక ఎన్నికలకు వ్యూహరచన వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!