NTV Telugu Site icon

Jethwani case: రిమాండ్‌ను సవాల్‌ చేసిన విద్యాసాగర్‌.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

Jethwani Case

Jethwani Case

Jethwani case: ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనంగా మారిన. ముంబై సినీ నటి జిత్వానీ కేసులో రిమాండ్ ను సవాల్ చేస్తూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేశారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.. అయితే, కుక్కల విద్యాసాగర్ లో తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ లో విచారించాలని ఒత్తిడి చేయబోమని హైకోర్టుకు తెలిపారు పోలీసులు.. దీంతో.. విద్యాసాగర్ రిమాండ్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..

Read Also: Urinate Position : మగాళ్లు మూత్రం నిలబడి పోయాలా, కూర్చుని పోయాలా?

కాగా, హీరోయిన్ జిత్వానీ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే.. ఇక. ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ లో అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొచ్చిన విషయం విదితమే.. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. విద్యాసాగర్ కు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం విదితమే.