NTV Telugu Site icon

PM Modi And Deputy CM Pawan Kalyan: మోడీ – పవన్‌ మధ్య ఆసక్తికర చర్చ.. ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..?

Pm Modi Pawan

Pm Modi Pawan

PM Modi And Deputy CM Pawan Kalyan: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ‌స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర చర్చ సాగింది.. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని మోడీ పలకరించడం.. దానికి నవ్వుతూ పవన్‌ కల్యాణ్‌ సమాధానం ఇచ్చిన వీడియో వైరల్‌గా మారిపోయింది..

Read Also: Vishwak Sen: లైలా దెబ్బ.. ఇక నా సినిమాల్లో అసభ్యత ఉండదు.. విశ్వక్ సేన్ కీలక ప్రకటన

అయితే, సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌, జనసైనికులు ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. అది పవన్‌ రేంజ్.. ప్రధాని మోడీ.. పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చే గౌరవం అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక, ప్రధాని-తన మధ్య జరిగిన చర్చను మీడియాకు వివరించారు పవన్‌ కల్యాణ్.. కాషాయ దుస్తుల్లో వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చూసి.. హిమాలయాలకు వెళ్తున్నారా? అని ప్రశ్నించారట ప్రధాని మోడీ.. దానికి ఇంకా సమయం ఉందంటూ సమాధానం ఇచ్చారట పవన్‌.. మొత్తంగా.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోడీ సరదాగా మాట్లాడారు.. మొత్తంగా మోడీ-పవన్‌ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది..