IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Srilakshmi: సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గత రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న శ్రీలక్ష్మికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమెను గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చింది. ఆ సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో శ్రీలక్ష్మి దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి పోస్టింగ్ లేకుండా కొనసాగారు. ఈ నెల 30న ఆమె పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, రిటైర్మెంట్కు కొద్ది రోజుల ముందే జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించడం ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన శ్రీలక్ష్మికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో ఈ నియామకం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!