Site icon NTV Telugu

Heavy Rains in Andhra Pradesh: ఏపీకి తుఫాన్‌ ముప్పు..! నేడు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు..

Imdrain

Imdrain

Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కి మరో తుఫాన్‌ ముప్పు పొంచిఉంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని.. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు.. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది..

Read Also: Nagula Chavithi: నేడే నాగుల చవితి.. పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!

అయితే, ఏపీకి తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని ఐఎండీ పేర్కొంది.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇవాళ వాయుగుండంగా.. రేపు తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశముందని పేర్కొంది.. ఇది తుపాన్‌గా మారితే ‘మొంథా (మొన్‌థా)’గా నామకరణం చేయనుంది ఐఎండీ.. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుండగా.. రేపు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ఇక, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

Exit mobile version