NTV Telugu Site icon

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏజెన్సీ ప్రాంతాల్లో కుంభవృష్టి..

Rains

Rains

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. సుమారు రెండుగంటలుపైగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు. పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లిలో వాగులు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో గిరిజనులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పలుచోట్ల వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనితో వాహనాలు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆనకట్టులు నీటమునిగాయి. సుమారు 50 గిరిజన గ్రామాలకు వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read Also: Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా.. గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం..

కాగా, నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందంటోంది వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విదితమే.. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణశాఖ. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.