NTV Telugu Site icon

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో సెలవు ప్రకటన..

Heavy Rains

Heavy Rains

Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరో 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. భారీవర్షాలు కురవనుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

Read Also: WT20 Worldcup 2024: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి.. అయినా సెమీ ఫైనల్‌ రేసులో

మరోవైపు ఇవాళ.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. భారీ వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని.. వాగులు, వంకలకు సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Read Also: Surya : ‘కంగువ’ ఆడియో రీలీజ్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో..?

భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.. మరోవైపు.. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.. అయితే, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం.. కలెక్టరేట్‌లో 0861-2331261, 7995576699, 1077 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.. మండలాలకు ప్రత్యేక అధికారును నియమించింది.. ఈ సమయంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చే శారు.. అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కలెక్టరేట్ లో 1077 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.. గత నాలుగు రోజులుగా జిల్లాలో ముసురు వాతావరణం ఉంది..