Heavy Rain Forecast: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..!
- ఏపీ రైతులకు ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు..
- తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ..
- దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Forecast: ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు పయనిస్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై అధికంగా ఉండనుంది. ఈనెల 29న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
Read Also: RBI Governor: గుండె నొప్పితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్
Also Read
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
వాయుగుండం ముప్పుకు రైతుల్లో అలజడి కనిపిస్తోంది. ప్రస్తుతం పంటలు కోత దశలో వున్నాయి. వరి ఎక్కడికక్కడ పొలాల్లో వుండిపోయింది. ఈ దశలో భారీ వర్షాలు నమోదైతే నష్టం జరుగుతుంది. బలమైన గాలులు వుంటాయి కనుక నెలకొరిగిపోయే ప్రమాదం వుంది. దీంతో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరమని ఐఎండీ సూచనలు జారీ చేసింది. మరో వైపు, ఆంధ్ర ప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తేలికపాటి నుంచి మొదలయ్యే వర్షాలు క్రమేపీ పెరుగుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక, ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు..
తాజావార్తలు
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!