ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపునకు ఆయన ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిందని, చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తన దృష్టికి రావడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు.
Read Also: Team India: న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని పవన్ ఆదేశం ఇచ్చారు. అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంపకానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. చెట్లను పెంచాలని అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పి.ఆర్. అండ్ ఆర్.డి. కమిషనర్ కృష్ణ తేజ ఆదేశాలు విడుదల చేశారు.
Read Also: Kadapa: బద్వేల్ ఇంటర్ విద్యార్థిని ఘటన కేసులో సంచలన విషయాలు..