Site icon NTV Telugu

Vijayasai Reddy: లిక్కర్‌ స్కామ్‌లో సాయిరెడ్డి సంచలన ట్వీట్.. వారి పని పట్టండి.. నేను పూర్తిగా సహకరిస్తా..

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ సంచలనంగా మారింది.. ఇప్పటికే సిట్‌ విచారణ ఎదుర్కొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కీలక సమాచారాన్ని సిట్‌ అధికారులకు చెప్పారు.. ఇక, రంగంలోకి దిగిన సిట్.. ఈ కేసులో కీలకంగా భావిస్తోన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్‌ చేసింది.. సోమవారం రోజు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్.. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది.. అయితే, మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కసిరెడ్డి.. విచారణకు వస్తానంటూ ఆడియో విడుదల చేశారు.. మరోవైపు రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఇదీలా ఉంటే.. రాజ్‌ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఈ లిక్కర్‌ స్కామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..

Read Also: Dil Raju: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

లిక్కర్‌ స్కామ్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ”ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను” అంటూ ట్వీట్‌ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కాగా, సిట్‌ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి రాజ్‌ కసిరెడ్డే నంటూ వ్యాఖ్యానించారు.. మరోవైపు.. రాజ్‌ కసిరెడ్డి విడుదల చేసిన ఆడియోలో సాయిరెడ్డిపై మండిపడ్డారు.. లిక్కర్‌ కేసు వ్యవహారం తేలిన తర్వాత.. విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానంటూ వ్యాఖ్యానించారు రాజ్‌ కసిరెడ్డి.. ఈ నేపథ్యంలో.. ట్వీట్‌తో మరింత రచ్చకు తెరలేపారు విజయసాయిరెడ్డి..

Exit mobile version