NTV Telugu Site icon

AP Budget 2025-26: ఏపీ బడ్జెట్ 2025-26.. ఆర్థికశాఖ కసరత్తు..

Ap Govt

Ap Govt

AP Budget 2025-26: 2025 – 26 ఆర్ధిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ త‌యారీ పై ఆర్ధిక శాఖ క‌స‌రత్తు ప్రారంభించింది..వ‌చ్చే మార్చి నెల‌లో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి..దీనిలో భాగంగా వ‌చ్చే ఏడాది బ‌డ్జెట్ పై ఆర్ధిక శాఖ క‌స‌ర‌త్తు ప్రారంభించింది..గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ల‌కు భిన్నంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న చేయాలని కుట‌మి స‌ర్కార్ భావిస్తోంది..గ‌త ప్ర‌భుత్వం ఏకంగా 7 ల‌క్ష‌ల కోట్లుకు పైగా అప్పులు చేసిందని….కానీ అభివృద్ది సరిగా జ‌ర‌గ‌లేదని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం భావిస్తోంది.. ..ఇదే క్ర‌మంలో గ‌త ప్ర‌భుత్వం 1.5 ల‌క్ష‌ల కోట్లు బిల్లులు పెండింగ్ లో పెట్టిందని కూడా ప్రభుత్వం పదే పదే చెబుతోంది.. పెట్టింది..దీంతో పాటు.. ..రాష్ట్ర అదాయంలో కీల‌కంగా ఉండాల్సిన అమ‌రావ‌తి , పోల‌వ‌రం లాంటి ప్రాజెక్ట్ లకు కూడా బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి….. ఆర్దిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేలా సియం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తునే ఉన్నారు..

వ‌చ్చే రెండేళ్ల పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి వ‌చ్చే 15వ ఆర్దిక సంఘం నిధులు ముందుగానే డ్రా చేసుకుంది..దీని వ‌ల‌న రాష్ట్రంలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ సంస్థ‌లు తీవ్ర న‌ష్టం వాటిల్లింది.. గ్రామీణ‌, పంచాయితీ రాజ్ శాఖ‌ల్లో నిధుల కొర‌త ఏర్ప‌డింది.దీనిని స‌రి చేయ‌డాని కుట‌మి స‌ర్కార్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుంది..95 కేంద్ర ప్ర‌భుత్వ పధ‌కాల‌ను గ‌త ఐదేళ్ల పాటు అమ‌లు చేయ‌క పోవ‌డం వల‌న రాష్ట్రం అభివృద్దిలో కీల‌క శాఖ‌లు న‌ష్ట పోయాయి..ఇదే స‌మ‌యంలో కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావాల్సిన అనేక వేల కోట్ల నిధులు నిరుప‌యోగం గా ఉన్నాయి.. కుట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక‌.. 95 కేంద్ర ప‌ధ‌కాల‌కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 74 ప‌ధ‌కాల‌ను సియం చంద్ర‌బాబు గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు..ఇంకా రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి గాడిలో ప‌డ‌లేదు..

..ఇలాంటి ప‌రిస్థితుల్లో 2025 – 26 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గాను ఆర్ధిక బ‌డ్జెట్ పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.. వివిధ శాఖల‌తో ఆర్ధిక శాఖ స‌మావేశాలు ఏర్పాటు చేసింది..వచ్చే ఏడాది గాను ఆయా శాఖ ల అవ‌స‌రాలు , ఎంత నిధులు అవ‌స‌రం అవుతాయి అన్న దానిపై శాఖ‌ల నుండి ప్ర‌తిపాద‌న‌లు తీసుకోనుంది… వ‌చ్చే బ‌డ్జెట్ కూర్పు ఏపి ఆర్ధిక శాఖ అధికారుల‌కు స‌వాల్ గా మారింది..ఒకప‌క్క భారీగా అప్పుల భారం.. మ‌రో వైపు బిల్లులు చెల్లింపులు భారం.. ఇదే క్ర‌మంలో అస్త‌వ్య‌స్తంగా మారిన అర్ధిక వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్దే ప‌నిలో ప్రభుత్వం ప‌డింది… సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు కొన్ని ప్రారంభించినా…త‌ల్లికి వంద‌నం, 18 ఏళ్ళు దాటిన ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు 1500 రుపాయిలు చెల్లింపు వంటివి కుట‌మి స‌ర్కార్ కు అతి పెద్ద స‌వాల్ ., దీనికి తోడు మ‌రి కొన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు కూడా ప్రధాన సమస్య గా ఉంది..గ‌త ప్ర‌భుత్వంలో కేవ‌లం సంక్షేమం పై దృష్టి పెట్టి .. రాష్ట్ర అభివృద్దికి కీల‌క‌మైన రంగాల‌కు నిధులు కేటాయింపు ప‌ట్ల నిర్ల‌క్ష్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి.ప్రస్తుతం ప్ర‌భుత్వానికి ఆదాయం పెర‌గ‌క పోగా ఖ‌ర్చులు భారీగా పెరిగాయి.. ఇప్పుడు ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్ ఇలాంటి అంశాల‌ను దృష్టిలో త‌యారు చేయ‌డం ఆర్ధిక శాఖ అధికారుల‌కు క‌త్తిమీద సాములా మారింది..ఒక ప‌క్క రాష్ట్రప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అమ‌రావతి నిర్మాణ‌,పోల‌వ‌రం నిర్మాణం పూర్తి, ఇదే క్ర‌మంలో ఒక ప‌క్క గ్రామాల‌లో మౌళిక వ‌స‌తులు క‌ల్ప‌న.. ఇంకో వైపు ప‌ట్ట‌ణాల‌లో వ‌స‌తుల క‌ల్ప‌న పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌నుంది.. ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కోక్క‌టిగా ద‌శల వారిగా అమ‌లు చేయ‌డం.. రాష్ట్రంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌ట్ల స‌మ‌ప్రాధాన్యం ఇవ్వ‌డం పై ఆర్దిక శాఖ ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది…

Show comments