NTV Telugu Site icon

Andhra Pradesh: మంత్రుల పేషీల్లో ఫేక్‌ నియామకాలు..! వెలుగులోకి సంచలన విషయాలు..

Ministers Portfolios

Ministers Portfolios

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకే మంత్రి పేషీలో నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించినట్టు సమాచారం. సోషల్ మీడియా అసిస్టెంట్ నియామక ప్రక్రియ బాధ్యత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ బయటకు వచ్చింది.. దీంతో నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని పెద్ద కుంభకోణం జరిగిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.. లేని పోస్టుతో జూనియర్ అసిస్టెంట్ పోస్టు సృష్టించి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో బయటకు వచ్చింది.. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ ఆర్డర్ ఎవరిచ్చారు..?ఎలా తయారు చేశారు..? అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. మొత్తంగా సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే.. ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామలు.. అటు హైకోర్టు.. ఇటు ఎస్సీ, ఎస్టీ కోర్టు..!