NTV Telugu Site icon

Buggana Rajendranath: ఏపీ బడ్జెట్‌ 2024-25.. మాజీ ఆర్థిక మంత్రి సెటైర్లు..

Buggana

Buggana

Buggana Rajendranath: ఏపీ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.. రూ. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ ముందు పెట్టారు.. అయితే, వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఏపీ బడ్జెట్‌పై సెటైర్లు వేశారు.. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.. ఏపీ ప్రజలకు బడ్జెట్ గండికోట రహస్యంగా మారిందని దుయ్యబట్టారు.. వైసీపీ 2019లో ప్రభుత్వం వచ్చిన సమయంలో నెల వ్యవధిలో బడ్జెట్ ప్రవేశ పెట్టాం.. కానీ, భారీ మ్యాండెట్ ప్రజలు ఇస్తే ప్రభుత్వం నెగెటివ్ తీరుతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది.. గత ప్రభుత్వం కంటే 41 వేల కోట్లు అధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. కేంద్రం నుంచి వచ్చే 15 వేల కోట్లు గ్రాంటా అప్పో క్లారిటీ లేదు.. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పన్ను ఆదాయం తగ్గుతోంది.. పన్ను ఆదాయం మైనస్ లో ఉంటే పన్ను ఆదాయం పెరుగుతోంది అని ఎలా చెబుతారు? అసలు సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడా జరపలేదన్నారు..

Read Also: Minister Kolusu Parthasarathy: మరో రెండు పథకాల అమలు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు..

తల్లికి వందనం పథకానికి 12450 కోట్లు ఏడాదికి అవసరం.. ప్రభుత్వం 5386 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించిందన్న బుగ్గన.. అన్నదాత సుఖీ భవ పథకానికి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు.. దీపం పథకానికి 1.50 కోటి మంది ఉంటే 1.42 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి.. 95 లక్షల మందికి దీపం సిలెండర్ ఇవ్వాల్సి ఉంది.. 8100 కోట్లు విద్యుత్ సబ్సిడీ ప్రభుత్వ ఇస్తే వైసీపీ ప్రభుత్వం 11 నుంచి 15 వేల కోట్లు ఇచ్చింది.. గత ఐదేళ్లలో 68 వేల కోట్లు బకాయి లో 62 వేల కోట్లు చెల్లించాం అన్నారు.. ఇక, అమరావతి అంటేనే ప్రపంచ బ్యాంక్ వెనుకడుగు వేస్తోంది.. 2014లో 87 వేల కోట్లు రుణాలు ఉంటే అధికారంలోకి వచ్చి 15 వేల కోట్లు రుణ మాఫీ చేశారని వ్యాఖ్యానించారు.. ఇక, ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నికలు హామీలు ఇవ్వటం అధికారం వచ్చాక చేయకపోవటం ఎన్నో ఏళ్లుగా జరిగిందని దుయ్యబట్టారు.. ప్రజలు కూడా ఈ మాయ మాటలు నమ్మి ఆశ పడి లొంగి పోతున్నారు అనిపిస్తోంది.. అప్పులు చేయటం కోసమే ఢిల్లీకి వెళ్తామని అప్పట్లో పవన్ కల్యాణ్‌ అన్నారు.. మరి ఇప్పుడు పవన్ కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు ఉన్నారు అని విమర్శించారు. 14 లక్షల కోట్లు అప్పులు చేశామని అసత్య ప్రచారం చేశారు .. 6.46 లక్షల కోట్లు అప్పు ఉందని మీరే డాక్యుమెంట్ లో చెప్పారన్నారు.

Read Also: Drug Peddlers Arrest: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టుర

సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా మేం అనేక పనులు కేంద్రం నుంచి సాధించాం అన్నారు బుగ్గన.. 10 శాతం ఎక్కువ అప్పులు టీడీపీ చేసింది.. చంద్రబాబు కంటే వైఎస్సార్, రోశయ్య, జగన్ హయంలో రాష్ట్రంలో సంపద పెరిగిందని పేర్కొన్నారు.. రాజకీయ విమర్శలు వేరు నిజాలు వేరన్న ఆయన.. బడ్జెట్ స్పీచ్ లో కూడా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారు.. ప్రజల కోసం మాట్లాడటానికి సమయం కోసం హోదా ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి..