NTV Telugu Site icon

Avanthi Srinivas To Resign YCP: వైసీపీకి మరో భారీ షాక్‌.. పార్టీకి మాజీ మంత్రి గుడ్‌బై..

Avanthi

Avanthi

Avanthi Srinivas To Resign YCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయ్యింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఘన విజయాన్ని సాధించి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఇక, అప్పటి నుంచి వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు.. పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు.. పార్టీ నేతలు.. పార్టీకి గుడ్‌బై చెబుతూ.. కూటమి పార్టీలో చేరుతూనే ఉన్నారు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశారు అవంతి శ్రీనివాస్‌..

Read Also: Hajj Yatra: హజ్‌ యాత్రకు పది వేల మందికీ అవకాశం.. కమిటీ చరిత్రలో ఇదే తొలిసారి..

కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు అవంతి శ్రీనివాస్‌.. 2019 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్‌.. వైసీపీ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.. అయితే, అవంతి పార్టీ వీడుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.. చివరకు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై.. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు.. అయితే, “నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్‌ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నీ రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను” అంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్‌ అవంతి శ్రీనివాస్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు..

Read Also: Mohan Babu: మోహన్‌బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు?

ఇక, తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు.. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌కి.. వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌.. కాగా, అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు.. అయితే, 2014 ఎన్నికలలో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ 1లో పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.. కానీ, జగన్‌ కేబినెట్‌ 2లో ఆయన్ని పక్కన బెట్టారు.. ఆ సమయంలో పలు వివాదాల్లో కూడా అవంతి పేరు వినిపించింది.. ఇక, తాజాగా జరిగిన ఎన్నికలలో అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఘోర పరాజయాన్ని మూఠగట్టుకున్నారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఏకంగా 92,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు.. వైసీపీలో పరిణామాలను జీర్ణించుకోలేక ఇబ్బంది పడ్డారట అవంతి శ్రీనివాస్.. ఈ నేపథ్యంలోనే పార్టీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది..

Show comments