Site icon NTV Telugu

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం… వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు..

Mithun Reddy Ed Notice

Mithun Reddy Ed Notice

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఎంపీకి నోటీసులు జారీ చేసింది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు ఉన్నాయని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా హవాలా మనీ ల్యాండరింగ్‌ రూపంలో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పలువురిని విచారించిన ఈడీ, తాజాగా మరో ఎంపీకి నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిధుల మళ్లింపు, అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఈడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.

Read Also: Mother Kills Son: ప్రియుడితో అసభ్యకర రీతిలో చూసిన కొడుకు.. చంపేసిన తల్లి.. కలల్లో కనిపించడంతో

ఈడీ నోటీసుల నేపథ్యంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొనగా, రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ..

Exit mobile version