NTV Telugu Site icon

AP Registration: రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం.. ఏపీలో అమల్లోకి కొత్త విధానం..

Ap Registration

Ap Registration

AP Registration: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చారు. ఆన్‌లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజలు వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా డిజిటల్‌గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌లు, వివాహ రిజిస్ట్రేషన్ లాంటి సేవలను ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్ కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుందని స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు అయిన స్లాట్‌లను రద్దు చేసుకుంటే వంద రూపాయలు, సమయం మార్పు చేస్తే రెండు వందల రూపాయలు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్‌లైన్ ద్వారా డాక్యుమెంట్ లను అప్‌లోడ్‌ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కు సంబధించిన ఫీజులు కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం.

Read Also: Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?

ఆన్ లైన్ డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా డిజిటల్‌గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే అవకాశం ఉంటుంది.. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రెషన్‌లు, లేదా వివాహ రిజిస్ట్రేషన్ లాంటి వివిధ సేవలను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది ఏపీ ప్రభుత్వం.. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్‌కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.. స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందించనున్నట్టు తెలిపింది ప్రభుత్వం.. అయితే, డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు అయిన స్లాట్‌ను రద్దు చేసుకుంటే రూ.100, సమయం మార్పు చేస్తే రూ.200 చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. ఈ వ్యవస్థ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్‌లైన్ ద్వారా డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు సంబధించిన ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.