NTV Telugu Site icon

Vijayawada Floods: వరద బాధితులకు అండ.. ఏపీ సీఎం సహాయ నిధికి పలువురు విరాళాలు

Donations

Donations

Vijayawada Floods: విజయవాడ సహా ఏపీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. ఇక, కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మరోవైపు.. ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు.. పారిశ్రామిక వేత్తలు.. రాజకీయ నాయకులు.. వివిధ రంగాలకు చెందినవారు ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.. ఇక, వరద బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విరాళాలు అందజేస్తున్న దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్‌‌కు కేంద్రం కూడా షాక్.. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్

తాజాగా విరాళాలు అందించిన వారు…
1. వల్లూరుపల్లి లక్ష్మీకిషోర్(వరుణ్ గ్రూప్ డైరెక్టర్), వల్లూరుపల్లి వరుణ్ దేవ్(ఎండీ) రూ.2 కోట్లు.
2. ఆర్.వీ.ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున డైరెక్టర్ శర్నాల గణేష్ రూ.1 కోటి
3. ఏపీ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ రూ.25 లక్షలు.
4. డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్, సిబార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రూ.10 లక్షలు
5. ఎస్.ఎన్.పూర్ణిమ రూ.5 లక్షలు(ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, విజయవాడ చాప్టర్)
6. బి.శాంతి వరలక్ష్మీ రూ.1 లక్షా 25 వేలు
7. టీడీపీ నేత గోనుగుండ్ల కోటేశ్వరరావు రూ.1 లక్షా 16 వేలు
8. సూరెడ్డి శ్రీధర్ రూ.1 లక్ష
9. పెమ్మనబోయిన సమాదానం రూ.50 వేలు
10. అబాజ్ అలీ బాషా రూ.50 వేలు
11. గోల్డెన్ ట్రీ ఎంటర్ ప్రైజెస్ రూ.10 వేలు
12. పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి రూ.10 వేలు చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

మరోవైపు.. వరద బాధితుల సహాయార్ధం ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల విరాళం చెక్కును ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి అందచేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ను అభినందించారు సీఎం చంద్రబాబు నాయుడు..