NTV Telugu Site icon

Aqua: ట్రంప్‌ నిర్ణయంతో ఆక్వా రంగం కుదేలు.. కేంద్రానికి చంద్రబాబు లేఖ..

Aqua

Aqua

Aqua: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. అమెరికా నిర్ణయం అమల్లోకి వచ్చిన కొద్దిగంటల్లోనే రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి.. విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలు ఒక్కో కేజీ కి 50 రూపాయల వరకు ధరలు పడిపోయాయి. దీంతో రొయ్య సాగు చేసే రైతుకు తీవ్ర నష్టం ఏర్పడింది. అమెరికా మార్కెట్లో ఆధారం చేసుకుని పశ్చిమ గోదావరి నుంచి ఏటా 18 వేల కోట్ల రూపాయల పైగా విలువచేసే రొయ్యలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం 20 కౌంట్, 30 కౌంట్, 40 కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతి దారులు వాటిని కొనుగోలు చేయట్లేదు. మరొక ఐదారు రోజులు వేచి చూడాలనే ఆలోచనతో రైతులు పట్టుబడులు సాగించడంలేదు. ఇక 100 కౌంటు రొయ్యల ధరల సైతం కేజీకి 40 రూపాయల వరకు తగ్గు ముఖం పట్టాయి..

రొయ్యలు చెరువులో ఉన్నంతకాలం వాటికి మేత, మందులు, కరెంట్ ఖర్చులు రైతులకు తప్పవు. చెరువులో వేసిన పిల్లలు 80 శాతం వరకు పెరిగితే పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 100 శాతం రొయ్యలు పెరిగినా.. ధరలు పడిపోవడంతో ఎకరానికి రైతుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు నష్టం వచ్చేలా కనిపిస్తోంది. రిటైల్ షాపుల్లో సైతం రొయ్యల ధరల శాతం తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో కనిపించడంలేదు. ఆక్వా సాగులో ప్రతి ఏటా ఎదురవుతున్న సమస్యలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు రైతులకు ఊపిరాడకుండా చేస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు లక్ష పదివేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ట్రంప్‌ అమెరికాకుఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై సుంకాలువిధించటంతో ఇప్పటి వరకు ఆక్వా రంగంలోఉన్న సానుకూల పరిస్థితులు తల్లకిందులయ్యాయి. రొయ్య ధరలు తగ్గితే ఆ ప్రభావం ఇతర రంగాలపైన తీవ్రంగా కనిపిస్తుంది. రొయ్య పిల్లల తయారీ కేంద్రాలు, ఫీడ్, మందుల తయారీ కేంద్రాలు, ఐస్ ప్లాంట్లు, చెరువుల్లో ఆక్సిజన్ ఫ్యాన్లు, మోటర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారాలు ఇలా అనేక రంగాలు ఆహ్వానం పైన ఆధారపడి ఉన్నాయి. ఆక్వా రైతులను ఆదుకునేందుకు వీడు ధరలు తగ్గించాలని కొనుగోళ్లు చేపట్టాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రొయ్యల సాగుకి క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. రొయ్యల సాగు తగ్గితే వీరందరికీ ఉపాధి కష్టమవుతుంది.

ట్రంప్ రొయ్యల ఎగుమతి పై 26 శాతం పన్ను విధింపు చేయడంతో ఆక్వా రైతులు ఇప్పటికే రోడ్డెక్కారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పూలపల్లి వై జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రైతులను ఆదుకునే చర్యలు తీసుకోకుంటే జై భారత్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల పాటు క్రాఫ్ హాలిడే ప్రకటించినట్లు తీర్మానించారు. క్రాఫ్ హాలిడేలో పాలకొల్లు, నరసాపురం, ఆచంట రైతులు పాల్గొంటారని మాకు అనుబంధ సంస్థలైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతుల సైతం మాకు మద్దతుగా క్రాఫ్ హాలిడేకు సహకరించాలని కోరుతామని ప్రస్తుతం మూడు నెలలు ప్రకటించామని రానున్న రోజుల్లో ఇది 6 నెలలు సంవత్సరం వరకు అయిన ఫ్లాంట్లు దిగి రాకపోతే కొనసాగిస్తామని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు.

రైతుల ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాసినట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డొనాల్డ్‌ ట్రంప్ నిర్ణయాల తో భారత్ ఒక్కటే కాదు ప్రపంచ దేశాలు నష్ట పోతున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల గురించి అధికారులు, ఆక్వా పరిశ్రమ ప్రతినిధులతో ను సమావేశం అవుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..