Dwaraka Tirumala Rao: పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్.. డీజీపీ భావోద్వేగం..

  • మంగళగిరిలో డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ ఫేర్వెల్‌ పరేడ్‌..
  • నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు..
  • సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు..
  • యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్‌గా అనిపించింది..
Dwaraka Tirumala Rao

Dwaraka Tirumala Rao

Dwaraka Tirumala Rao: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తన పదవీ విరమణ ఫేర్వెల్‌ పరేడ్‌లో భావోద్వేగానికి గురయ్యారు.. యూనిఫామ్‌ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని పేర్కొన్నారు.. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ ఫేర్వెల్‌ పరేడ్‌ నిర్వహించారు.. ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ.. నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు.. సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు.. దశాబ్దాలుగా నన్ను అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్‌గా అనిపించిందని పేర్కొన్నారు.. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న నాకు అనేక మంది సహకరించారు.. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశాను అన్నారు..

Read Also: Hyderabad: ఇన్స్టాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. ట్విస్ట్ ఏంటంటే..?

ఇక, సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని గుర్తుచేసుకున్నారు ద్వారకాతిరుమల రావు.. ప్రతి పోలీసులో ప్రొఫెషనలిజం తెస్తున్నాం.. సైబర్ క్రైమ్, గంజాయి, మహిళలు చిన్నారులపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం అన్నారు. విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసలు కురిపించారు.. యూనిఫాం ధరించిన వారి అందరికీ న్యాయం అందించాలి అని కోరుతున్నట్టు తెలిపారు.. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.. కేసుల విచారణలో కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇక, డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ద్వారకా తిరుమల రావు.. బాధ్యతలు ఇవ్వటమే కాదు వాటి నిర్వహణకు గైడెన్స్ కూడా ఇచ్చారన్న ఆయన.. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశానని వెల్లడించారు.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు.. సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు, గుణపాఠాలు, పరిచయాలు, ఎమోషన్స్ తో కలిసి ఉన్నాయి.. విధి నిర్వహణలో లేనప్పటికీ నా మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డీజీపీ ద్వారకాతిరుమల రావు.