Kasibugga Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు జనసేన నుంచి ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఘటనా స్థలికి వెళ్లాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగ మాధవిలను కాశీబుగ్గ ఘటన మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి పవన్ కల్యాణ్‌కి నివేదిక అందిస్తారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు పిసిని చంద్రమోహన్, కొరికాన రవికుమార్,. దానేటి శ్రీధర్, గేదెల చైతన్య తదితరులు ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులకు అవసరమైన సేవలందిస్తున్నారు.
Read Also: చలికాలంలో బికినీతో హీట్ పుట్టిస్తున్న గీతిక తివారి..
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో కాశీబుగ్గలో తొక్కిసలాట దుర్ఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు.. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నుంచి ఈ ఘటనపై మాట్లాడిన సీఎం. అత్యంత బాధాకరమైన ఘటన కాశీబుగ్గలో చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.. తుఫాన్‌లో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరం అన్నారు.. దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేస్తున్నానని వెల్లడించారు.. కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించారు ముఖ్యమంత్రి, ప్రజావేదికకు హాజరైన ప్రజలు.. ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయం లో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం విచారకo.. ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదన్నారు.. ప్రతీ ఒక్కరి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ తరహా చర్యల వల్ల తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ గా వ్యవహరిస్తామని.. తక్షణం కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
