NTV Telugu Site icon

Pawan Kalyan: ఎందరో త్యాగధనుల ఫలితమే వైజాగ్ స్టీల్ ప్లాంట్

Pawankalyan

Pawankalyan

ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు పవన్‌కల్యాణ్.. ప్రధాని మోడీ.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం రూ.11, 440 కోట్లు కేంద్రం కేటాయించడంతో వేల కుటుంబాల ఆశలు చిగురించేలా చేసిందన్నారు. ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇది ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదని.. 1966 నాటి త్యాగాలకు ఇచ్చిన గుర్తింపు అని పేర్కొ్న్నారు. 1966లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను అర్పించిన అమృతరావుతో సహా లెక్కలేనన్ని మంది ఇతరుల త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా మండుతోందని తెలిపారు. వారి రక్తం మరియు కన్నీళ్లు నేడు ఒక ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజల గర్వం మరియు గుర్తింపుగా నిలిచిన దానికి పునాది వేశాయని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని రక్షించిన ఆటో డ్రైవర్ “భజన్ సింగ్ రాణా”.. ఘటన గురించి ఏమన్నారంటే..

విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూ్స్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bharat Mobility Expo: కియా కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల..18 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!.. 494 కి.మీ రేంజ్..