Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఆ గిరిజనుల రహదారి సమస్య పరిష్కారం.. ఫొటోలు షేర్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌..

Ap Roads

Ap Roads

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం హయాంలో రోడ్ల పరిస్థితిపై ఎన్నో విమర్శలు వచ్చాయి.. అయితే, తాను అధికారంలోకి రాగానే, రోడ్లు పరిస్థితి మారుస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.. ఇక, రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.. ఇప్పుడు పూర్తి చేసిన రోడ్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఓ పోస్టు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Read Also: Hamas-US: కాల్పుల విరమణపై అమెరికా చర్చలు.. హమాస్ తిరస్కరణ

“గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు రూ.87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ రహదారి నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యింది” అని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్.. ఇక, “సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, దాదాపు రూ.1,000 కోట్ల నిధులతో – గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రారంభించిన అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా, ఇన్నేళ్లుగా సరైన రోడ్లు లేక వైద్యానికి, అవసరాలకు ఇబ్బందిపడుతున్న గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారికి అభివృద్ధిని చేరువ చేస్తోంది..”అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version