Deputy CM Pawan Kalyan: విశాఖ కాలుష్య నివారణకు చర్యలు.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

  • విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు..
  • నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు తీసుకుంటాం..
  • కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని కూడా తగ్గిస్తాం..
  • అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏపీ శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. విశాఖ కాలుష్య నివారణకు, పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతాం అన్నారు.. పలాస జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువ డేది.. కానీ, ఇప్పుడు ఆ జీడిపప్పు తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయం సమకూర్చుతున్నామని పేర్కొన్నారు.. పరిశ్రమలలో కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని కూడా తగ్గిస్తున్నామని తెలిపారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Minister Nimmala Ramanaidu: 1,040 లిఫ్ట్‌ స్కీమ్‌ల్లో 450 మూత‌.. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం..

అయితే, కొన్ని దశాబ్దాలుగా విశాఖ పరిశ్రమల అభివృద్ధితో కాలుష్యానికి దగ్గర అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌.. ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా, విశాఖను కాలుష్యానికి దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తాం అన్నారు.. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.. అయితే, తమ ప్రభుత్వం గాలిలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.. కాలుష్యం ఏ అభివృద్ధికి అయినా ఆటంకం కలిగిస్తోంది.. కాలుష్యం లేని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.. ఇక, ఈ సందర్భంగా కాలుష్య నివారణ కోసం ప్రపంచస్థాయి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై శాసన మండలి వేదికగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..