NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: సర్పంచ్‌లతో సమావేశం.. వాలంటీర్లపై తేల్చేసిన డిప్యూటీ సీఎం పవన్‌..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో సర్పంచ్ సంఘాల‌తో సమావేశం అయిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వాలంటీర్‌ వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై స్పందించిన పవన్‌.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అయితే, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.. కానీ, వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అన్నారు.. ఇక, గ్రామ‌ల‌కు నీళ్లు పంప‌డానికి స‌రైన పైప్ లైన్ల విష‌యంలో పూర్తిగా మార్పులు తెస్తాం.. టెక్నిక‌ల్ గా లోపాలు గుర్తించాం అన్నారు పవన్‌.. గ్రామ‌ల‌కు సంబంధించిన నిధులు విడుద‌ల‌పై ఆర్ధిక శాఖ‌తో మాట్లాతాం అన్నారు..

Read Also: Anil Ambani : అనిల్ అంబానీకి షాక్.. తన ఫేవరేట్ కంపెనీకి మూడేళ్ల పాటు నిషేధం

ఉచిత విద్యుత్ విష‌యంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం.. ఉచిత విద్యుత్ అంశంపై కేబినెట్ లో మాట్లాడతామని తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. క్వారీల‌లో బాంబు పేలినా చాలా ఇళ్ళు దెబ్బతింటాయి.. సిన‌రేజీ గురించి మాట్లాడుతాం.. బకాయిలు ల‌క్షకోట్లు దాటేలా క‌నిపిస్తోంది… మేం ప్రతీ అంశంలో పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్నాం.. స్టేట్ ఫైనాన్స్ క‌మీష‌న్ నుంచీ రావాల్సిన వాటిపైన కూడా ఆర్ధిక శాఖ‌తో మాట్లాడుతాం అన్నారు.. సర్పంచ్ అనేవాళ్లు గ్రామ ప్రధ‌మ పౌరుడు.. వారికి గౌర‌వానికి లోటుండ‌కూడదన్న ఆయన.. గాంధీ గారు పెట్టిన పంచాయితీరాజ్ చ‌ట్టాన్ని పూర్తిగా నీరుకార్చారని విమర్శించారు.. సోష‌ల్ ఆడిట్ చేయ‌డానికి ఒక డీఎస్పీ స్ధాయి అధికారిని ఏర్పాటు చేశాం.. సిటిజ‌న్ ఇన్ఫర్మేష‌న్ బోర్డులు పెట్టాల‌ని క‌చ్చితంగా చెప్పాం అన్నారు.. ప్రతి కార్యక్రమం కూడా పంచాయితీ ప్రజ‌లకు వాట్సప్ ద్వారా పంపడం పై ఆలోచిస్తున్నాం అని వెల్లడించారు. సిటిజ‌న్ ఇన్ఫర్మేష‌న్ బోర్డులు విష‌యంలో స‌ర్పంచులు కూడా బాధ్యత వ‌హించాలని సూచించారు.. మాది వినే ప్రభుత్వం.. మెత్తగా చ‌ప్పగా ఉండే ప్రభుత్వం కాదన్నారు..

Read Also: Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..

ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత తీసుకున్నాక కొన్నిసార్లు తిట్లు త‌ప్పవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్‌ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియ‌స్ అంశాల‌పై క‌చ్చితంగా స్పందిస్తారని తెలిపారు.. ఇక, వాలంటీర్ల వ్యవ‌స్ధ అనేది ఒక స‌మాంత‌ర వ్యవ‌స్థగా ఉంది.. కానీ, గ్రామ స‌చివాల‌య సిబ్బందిని ర‌ద్దు చేయ‌డంపై ఆలోచించలేదన్నారు.. వలంటీర్లను మోసం చేసి పెట్టుకున్నారు… వారి జీతాలు పెంచాల‌న్నా కూడా జీవోలో స‌రిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..