Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: పెద్దిరెడ్డి భూముల వ్యవహారం.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Gummanur Narayana Arrested: కాంగ్రెస్‌ నేత హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. మాజీ మంత్రి కజిన్‌ అరెస్ట్‌..

పెద్దిరెడ్డి భూముల వ్యహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు.. అటవీ భూముల అక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పవన్‌ కల్యాణ్‌.. అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులను గుర్తించి నివేదిక రూపొందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. అదే విధంగా భూములు ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులతోపాటు, అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version