NTV Telugu Site icon

Pawan Kalyan: మొగలి కనుమదారిలో రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం..

Pawan Kalyan

Pawan Kalyan

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం అందిందని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో సహా ఎనిమిది మంది మృత్యువాత పడటం, 31మంది గాయపడటం బాధాకరం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకొంటుంది.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also: CM Yogi: యోగి చేతికి గాయం.. రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని బయటపెట్టిన సీఎం

రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి..
చిత్తూరు జిల్లా పూతలపట్టు మొగలి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వడం పురంధేశ్వరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పురంధేశ్వరి ఆదేశించారు. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.. అందువల్ల ప్రమాదాలు నివారణకు రోడ్డు సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Read Also: CM Chandrababu: రోడ్లు-భవనాల శాఖపై సీఎం సమీక్ష.. మరమ్మత్తుల కోసం నిధులు విడుదల

Show comments