Deputy CM Pawan Kalyan: మనం కర్మకు వదిలేసి వెళ్లిపోతున్నాం.. ఇది మారాల్సిందే.. పవన్‌ కీలక వ్యాఖ్యలు..

  • ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలి ..
  • హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా..
  • మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం..
  • ఇది మారాల్సిందే-పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan Amaravati

Pawan Kalyan Amaravati

Deputy CM Pawan Kalyan: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని అన్నారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. దేవుడిపై భయం, ధర్మంపై గౌరవం ఉన్న సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రావస్థ నుంచి, సౌకర్య భావన నుంచి మనం బయటకు రావాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎవరు మన హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా, మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం అన్నారు. అయితే, ఇది మారాల్సిందే అని పిలుపునిచ్చారు పవన్‌ కల్యాణ్‌.. కులం, మతం, ప్రాంతం, భాషలతో మనం విభజించబడి ఉన్నా, మన ధర్మం ఒక్కటే.. దేవుళ్లు కూడా ఒక్కటే.. మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు, మన బాధను గొంతెత్తి చెప్పడం మన బాధ్యత అన్నారు పవన్.. అలాంటి సందర్భాల్లో మౌనం సమిష్టి మనస్సాక్షిని బలహీనపరుస్తుంది అన్నారు..భక్తులుగా మాత్రమే కాకుండా, మన విశ్వాసానికి జాగ్రత్తగా కాపలాదారులుగా కూడా మనం వ్యవహరించాలి అని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. అది కేవలం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవడమే అంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..