Site icon NTV Telugu

Cyclone: తీరం దాటిన వాయుగుండం..

Rains

Rains

Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం గండం తప్పినట్టు అయ్యింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తెల్లవారు జామున తీరం దాటింది.. గోపాల్ పూర్ సమీపంలో తీరాన్ని దాటి బలహీన పడుతోంది వాయుగుండం.. దీంతో, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, ఈ ప్రభావంతో ఇవాళ నెల్లూరు మినహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుయనున్నాయి.. ఇదే సమయంలో, సముద్రం కల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, భూ ఉపరితలంపై తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది వాయుగుండం.. ఈ ప్రభావంతో.. తెలంగాణలో మరో రెండు రోజుల ఈరోజు, రేపు భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ.. కాగా, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి..

Read Also: UP: ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలపై ఉక్కుపాదం.. యూపీ మతాధికారి అరెస్ట్

Exit mobile version