Site icon NTV Telugu

Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు.

Amaravati

Amaravati

Amaravati: ఏపీ రాజధానికి జాతీయ రహదారికి అనుసంధానం చేసే అంశపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌హైవేతో అనుసంధానం చేసేలా సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్ల నిర్మాణానికి సీఆర్డీయే ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో అదనంగా రాజధానిలోని ఈ-11, ఈ-13 రోడ్లను కూడా 16వ నెంబర్ జాతీయ రహదారికి లింక్ చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ రెండు రోడ్లను చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ప్లాన్లు వేస్తోంది. మంగళగిరి ఎయిమ్స్ కోసం అభివృద్ధి చేసిన రోడ్ల మాదిరిగా కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది..

Read Also: Minister Narayana: గుంటూరు కార్పొరేషన్‌లో సమస్యలపై మంత్రి నారాయణ సమీక్ష

Exit mobile version