Site icon NTV Telugu

AP Capital: అమరావతిలో రూ.4,668 కోట్లతో ఐదు టవర్లు.. టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..

Ap Capital

Ap Capital

AP Capital: రాజధాని అమరావతి నిర్మాణంపై వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. వచ్చే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు.. మరోవైపు.. ఎంపిక చేసిన పనులకు టెండర్లు పిలుస్తోంది సీఆర్డీఏ.. రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు సీఆర్డీఏ అధికారులు.. సచివాలయానికి 4 టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు.. హెచ్‌వోడీ టవర్‌ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్‌ పిలిచిన అధికారులు.. సచివాలయానికి సంబంధించిన 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్‌కు పిలిచారు.. ఇక, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేశారు సీఆర్డీఏ అధికారులు.. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సీఆర్డీఏ.. మరోవైపు.. మే 1వ తేదీన సచివాలయ, హెచ్‍వోడీ టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనుంది సీఆర్డీఏ..

Read Also: Kushboo : వాళ్లు అసహ్యంగా ఉంటారు.. ఖుష్బూ ఫైర్..

కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు.. అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టి.. కొన్ని పనులు చేపట్టినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పూర్తిగా పక్కకు పెట్టింది.. అంతేకాకుండా.. మూడు రాజధానుల స్టాండ్‌తో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని భావించారు.. ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి అభివృద్ధిలో వేగంగా అడుగులు ముందుకు పడుతోన్న విషయం విదితమే..

Exit mobile version