NTV Telugu Site icon

CPI Narayana: కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు.. లడ్డూ వ్యవహారం వీధుల్లోకి వద్దు..!

Narayana

Narayana

CPI Narayana: తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోన్న వేళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు.. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన.. కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి‌‌.. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది.. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు‌‌..? తక్కువ రేటుకు నెయ్యి వస్తుందని.. లడ్డూలో ఎక్కడలేని దరిద్రాలు కలిపి తినమని చేబుతారా‌‌‌‌..? బుద్దిలేదా? అని ఫైర్‌ అయ్యారు..

Read Also: Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

తిరుమల నెయ్యి టెండర్లను రివర్స్‌లో చేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు నారాయణ.. దానివల్ల కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్టు వచ్చింది.. నెయ్యి విషయంలో ఎలాంటి అలోచన లేకుండా వైసీపీ టెండర్లు ఇచ్చింది.. లోపం దొరికింది కాబట్టి చంద్రబాబు బయటపెట్టారని తెలిపారు.. జగన్ ఇసుక మాఫియాకు, ఎర్రచందనం మాఫియాకు బోర్డు సభ్యులుగా ఇచ్చాడు‌‌‌ అని విమర్శించారు.. లడ్డూ నాణ్యత అనేది వైసీపీ ప్రభుత్వంలో లేదని.. వారం రోజుల ఉండే నాణ్యత ఒక్కరోజు కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు.. విచారణ కమిటీలో అన్ని తెలుతాయి… ఇకపై వీధుల్లో లడ్డూ వ్యవహారాన్ని తీసుకుని రాకండి అని సూచించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు సనాతన ధర్మం అంటే ముందు పవన్ కల్యాణ్ పూర్తిగా చదువుకోవాలని సూచించారు.. ఇంకోవైపు.. మోడీ మన ప్రధాన మంత్రి కాదు.. ఎప్పుడు విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాలో ఉంటాడని సెటైర్లు వేశారు.. ఇక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మేం ఒప్పుకోం అని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.