కాసేపటి క్రితం ముగిసిన పీఏసీ చైర్మన్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరిగింది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ నిర్వహించారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్‌రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read Also: Kannappa Poster: మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు
మరోవైపు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో వైసీపీ బాయ్ కాట్ చేసింది. అసెంబ్లీకి స్వంత కారణాలతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరవ్వలేదు. ఈ ఎన్నికలో మొత్తం టీడీపీ ఓట్లు 136.. బీజేపీ ఓట్లు 6, జనసేన ఓట్లు 21 ఉండగా.. మొత్తం 163 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో వివిధ కమిటీల సభ్యుల ఎన్నిక పోలింగ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మూడు కమిటీలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. వైసీపీ హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్ పనిచేశారు.
Read Also: Pawan Kalyan Hugs Botsa:అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స..