Collectors Conference: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12 నాటికి ఆరు నెలలు పూర్తి అవనుంది.. దీంతో, రాష్ట్రంలో పాలనను మరింత పరుగులు పెట్టించడానికి సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు.. ఇందు కోసం ఈనెల 11, 12 తారీఖుల్లో కలెక్టర్ల సదస్సు జరుపనున్నారు.. సచివాలయంలోని 5 వ బ్లాక్ లోని కలెక్టర్ కాన్ఫురెన్స్ హాల్‌లో సదస్సు నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం 10. 30 గంటలకు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభం కానుంది.. అనంతరం రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కలెక్టర్ల సదస్సు ప్రాముఖ్యతను వివరించనున్నారు.. అనంతరం ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్ , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రసంగించనున్నారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు ఉదయం 11. 05 గంటలకు కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు.. ఆయన ఉపన్యాసంలో విజన్ ఆంధ్రా డాక్యుమెంట్ 2047తో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు అధికారులకు చెప్పడంతో పాటు వారికి దిశానిర్ధేశం చేయనున్నారు. అమరావతి, పోలవరం పనులపైనా సీఎం ప్రస్తావించనున్నారు. అటు డ్రోన్ లను వివిధ శాఖల్లో ఎలా ఉపయోగిస్తుంది. డ్రోన్ ల యూజ్ కేసులపైనా ప్రత్యేకంగా ప్రజంటేషన్ ఉండే అవకాశం ఉంది. ఇక శాఖల వారిగా విజన్ స్వర్ణాంద్ర ప్రదేశ్ 2047పై ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ ప్రసంగించనున్నారు. 2017 లో ప్రారంభమైన ఆర్టిజీఎస్ ఆధారంగా వాతావరణ మార్పులను ఐఎండీ ద్వారా సంయుక్తంగా మానిటర్ చేయడంతోపాటు, అలెర్టులు అందిచడం, సిసి కెమెరాల మానిటరింగ్, డ్రోన్ లను వివిధ శాఖల్లో వాడడానికి ఉన్న యూజ్ కేసెస్ వంటి అంశాలపైనా చర్చించనున్నారు.
Read Also: Cinnamon Benefits: అనేక అనారోగ్య సమస్యలు.. ఒకే పరిష్కారం దాల్చినచెక్క
అనంతరం ప్రభుత్వానికి వచ్చిన వినతులు.. అవి ఏమేరకు పరిష్కారం అయ్యాయి అనే అంశంపై అధికారులు వివరిస్తారు.. ఇదే సమయంలో గ్రామ వార్డు సచివాలయాల పనితీరు ఉద్యోగులకు పని విభజన, వాటి ద్వారా అందుతున్న సేవలపై ఇప్పటి వరకు ఉన్న వివరాలను సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. భవిష్యత్ లో వాట్సాప్ ద్వార ప్రభుత్వ గవర్నెన్స్ ఏవిధంగా ఉపమోగించుకోవాలన్న దానిపై అధికారులు వివరించనున్నారు.. ఇదే సమయంలో రైతులకు కూడా వ్యయసాయం చేయడానికి , తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి వాట్సాప్ ను టూల్ గా ఎలా వాడుతున్నారు అనే దానిని అధికారులు వివరించనున్నారు. పాజిటివ్ పబ్లిక్ పెర్సప్సన్ లపై సదస్సులో చర్చించనున్నారు. ఇక, తొలిరోజు భోజన విరామానంతరం వ్యవసాయం శాఖ శాఖ పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఆ శాఖ ఉన్నతాధికారి. పంటలు, తుఫాను వల్ల జరిగిన పంటనష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలు, ధాన్యం సేకరణ విషయంలో తీసుకున్న చర్యలపైనా చర్చించనున్నారు. దేశం నుండి తరలిపోతున్న పిడిఎస్ బియ్యం నిల్వలు, నమోదు చేసిన కేసుల వివరాల పై సివిల్ సప్లయిస్ ఎండీ వీర పాండ్యన్ వివరించనున్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో వివిధ నీటి ప్రాజెక్టుల పనితీరుతో పాటు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ వివరించనున్నారు..
Read Also: Music Director Thaman: ఏంటి తమన్ బ్రో.. సింగర్‌ను పుసుక్కున అలా అనేసావ్
2027-28 ఆర్ధిక సంవత్సరానికి పోలవరం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది..రాష్ట్రంలో గ్రామీణాభివృద్ది , పంచాయితీ రాజ్ శాఖ పై చేపడుతున్న గ్రామీణ రోడ్ల పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి, గ్రామీణ నీటి సరఫరా, ఇంటింటికి నల్లా నీరు వంటి వాటిపై స్టేటస్ నోట్ ఇవ్వనున్నారు.. అలాగే సామాజిక పెన్షన్ల ను అందుతున్న తీరు, అందులోని అంశాలను వివరించనున్నారు ఆ శాఖ ఉన్నతాధికారి. రాష్ట్ర రాజధాని అమరావతి లో జరుగుతున్న పనులు, భవిష్యత్ లో చేపట్టబోయే పనులు, తాజా స్టేటస్ నోట్ తో పాటు, రాష్ట్రంలో వివిధ కార్పోరేషన్ లు మున్సిపాలిటీల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులపై మున్సిపల్ ,రాజధాని శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. ఇదే సమయంలో గతంలో ఎప్పుడు కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో శాంతి భద్రతలు అంశం సదస్సు చివరి రోజు.. చివరిలో జరిగేది.. కానీ ఇప్పడు తొలి రోజు చివరిలో శాంతి భద్రతలపై సియం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు..రాష్ట్రంలో శాంతి భద్రతలై డీజీపీ ద్వారకాతిరుమల రావు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. ఇక, రెండవరోజు కీలకమైన పలు శాఖలపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. ఇందులో కుటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం కి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి పలు కీలక పాలసీలను ప్రకటించింది ప్రభుత్వం.. పాలసీలు చూసిన పెట్టుబడుదారులు రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.. ఇప్పటి వరకు పెట్టుబడుల కోసం ముందుకు వచ్చిన కంపెనీలు, ఉన్న పారిశ్రామిక ప్రగతి పై ఆ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. రెవెన్యూశాఖ రాష్ట్ర వ్యప్తంగా నిర్వహిస్తున్న రివెన్యూ సదస్సులపైనా చర్చించనున్నారు. నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలపై చర్య చేయనున్నారు.. మైనింగ్ శాఖ ప్రస్తుత స్టేటస్ ను వివరించనున్నారు అధికారులు.. జిల్లాల వారీగా విజన్ 2047 లో భాగంగా అభివృద్ది ప్రణాళికలపైనా కలెక్టర్ కాన్ఫురెన్స్ లో చర్చించనున్నారు. సదస్సు ముగింపులో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలపై పెట్టాల్సిన ఫోకస్ ను వివరించనున్నారు…