Site icon NTV Telugu

CM Chandrababu: నేడు ఆర్థిక శాఖ, సోషల్ వెల్ఫేర్‌పై సీఎం సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి… తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు.. ఇక, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు..

Read Also: Love Marriage: ఫ్రాన్స్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన భారతీయ యువకుడు

అయితే, ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టిసారించారు అందులో భాగంగానే మరోసారి సమీక్షకు సిద్ధమయ్యారు.. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు.. రాష్ట్రానికి ఉన్న అప్పులు.. ఆదాయం.. ఖర్చులు.. రాబడిపై ఆరా తీయనున్నారు.. ఇక, పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించబోతున్నారు.. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై కూడా ఫోకస్‌ పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version