CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది ఏపీ సర్కార్. ఉపాధి హామీ పధకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా.. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4 వేల 500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకోనున్నారు. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Read Also: Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
కోనసీమ పర్యటన కోసం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి అయినవిల్లిలో టీటీడీ కళ్యాణమండపం వద్ద హెలిపాడ్ లో 11.40కి దిగుతారు సీఎం చంద్రబాబు.. అక్కడ అధికారులు, నేతలతో కొద్దిసేపు మాట్లాడతారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వానపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభాస్థలికి చేరుకుంటారు.. వానపల్లి గ్రామదేవత పళ్లాలమ్మను దర్శించుకుంటారు.. మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటలపాటు గ్రామసభలో పాల్గొంటారు.. అనంతరం పదినిమిషాల పాటు స్థానిక నేతలతో ముచ్చటించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వానపల్లి నుంచి రోడ్డు మార్గాన తిరిగి అయినవిల్లి హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్ లో రాజమండ్రి కి వెళ్లి.. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కు వెళ్లనున్నారు.
