NTV Telugu Site icon

CM Chandrababu: కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు.. అన్నింటినీ నెరవేరుస్తాం..

Babu

Babu

CM Chandrababu: కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయి.. ప్రజల ఆశలను నెరవేరుస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. భారత స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జెండా ఎగురవేసి శుభాకంక్షలు తెలిపిన ఆయన.. ఆ తర్వాత మాట్లాడుతూ.. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించాం. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నాం. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందాం. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచాం. 2014-19 మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందింది.. సంక్షోభం నుంచే అవకాశాలు వెతుక్కున్నాం.. అభివృద్ధికి బాటలు వేశాం. 2014-19 కాలంలో పోలవరం, రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించాం. టీడీపీ అధికారం కొనసాగుంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చాయి అన్నారు.. అయితే, ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సప్వ నాశనం చేశారు. ప్రశ్నిస్తేనే దాడులు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే విధ్వంసక పాలన చేపట్టారు. రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. అన్ని రంగాల్లో దోపిడీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల అప్పుల భారం పెరిగింది. గత ప్రభుత్వ విధానాల వల్ల తలసరి రుణం భారం పెరిగింది.. తలసరి ఆదాయం తగ్గిందని విమర్శించారు.

Read Also: Free Sand Scheme: ఉచిత ఇసుక విధానం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

మద్యం ఆదాయాన్ని.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. విధ్వంసపాలనపై ప్రజలు విసిగిపోయారు.. చైతన్యం వెల్లువెత్తితిందన్నారు సీఎం చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేసి.. కూటమికి అద్భుత విజయం అందించారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రజల ఆశలు నెరవెరుస్తాం అన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం. ఏపీ ప్రజలకు ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించింది. సుపరిపాలనకు తొలి రోజు నుంచే కూటమి ప్రభుత్వం నాందీ పలికింది. 100 రోజుల కార్యాచరణ రూపొందించాం. వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రభుత్వం పయనిస్తోందన్నారు.

Read Also: Pavithrotsavam 2024: నేటి నుంచి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు

ఐదు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. పాఠశాలలకు పార్టీ రంగులేసి.. విద్యా ప్రమాణాలకు గత ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాం.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మొదటి సభలోనే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం అన్నారు. సర్వే రాళ్లపై బొమ్మలకే రూ. 700 కోట్లు తగలేశారు. భూ సమస్యలను సృష్టించారని మండిపడ్డారు.. మీ భూమి.. మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా.. పెన్షన్ను రూ. 4 వేలకు పెంచాం. పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం. వలంటీర్లు లేకుంటే పెన్షన్లు సాధ్యం కాదని గత ప్రభుత్వం వృద్ధుల ప్రాణాలు తీసింది. వలంటీర్లు లేకుండానే తొలి రోజునే 99 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేపట్టాం. అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించనున్నాం అని వెల్లడించారు. రోజుకు 1.45 లక్షల మంది రూ. 5కే భోజనం చేసేవారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసింది. మళ్లీ పేదల కోసం అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయబోతున్నాం. గిరిజన మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు పెడతాం. అన్న క్యాంటీన్లకు విరివిగా విరాళాలివ్వాలి. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు స్కిల్ సెన్సస్ చేపడుతున్నాం. ప్రపంచంలో తొలిసారి స్కిల్ సెన్సస్ చేపడుతున్నాం. నిర్మాణ రంగ కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానం తెచ్చాం మని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments