Site icon NTV Telugu

CM Chandrababu Tweet: సాంకేతిక పరంగా చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. భారత్ ఏఐ ప్రయాణం ప్రారంభం..

Cbn

Cbn

CM Chandrababu Tweet: విశాఖలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ మంత్రి నారా లోకేష్‌, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్ సహా పలువురు గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు.. “సాంకేతిక పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. గూగుల్ తో 15 బిలియన్ల యూఎస్ డాలర్ల ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం చేసింది.. గిగావాట్- స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది.. భారతదేశ మొట్టమొదటి ఏఐ సిటీ, అతి పెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటు కానుంది.. అమెరికాకు వెలుపల ఈ స్ధాయిలో ఈ రంగంలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం.. దీనికి తోడు గూగుల్స్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు విశాఖపట్నం ఆతిధ్యం ఇవ్వనుంది.. తద్వారా డిజిటల్ నెట్ వర్క్ లో ఇండియా బలోపేతం కానుంది..” అని పేర్కొన్నారు.

Read Also: Yashasvi Jaiswal: నెక్స్ట్ ‘షేన్ వార్న్’ యశస్వి జైస్వాలే.. వీడియో వైరల్!

ఇక, “భారతదేశం ఈ పెట్టుబడి తరువాత ప్రపంచంతో సంబంధాలను మరింత పెంచుకుంటుంది.. వసుదైక కుటుంబం అనే సూక్తిని నిజం చేస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, వస్తు ఉత్పత్తి, వైద్యరంగం, ఆర్దిక రంగంలో ఇకపై కీలకంగా మారనుంది.. క్రిటికల్ సెక్టార్లలో సమూల మార్పులు తెచ్చి సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేయడంతో పాటు వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తుంది.. భారతదేశంలో భవిష్యత్తు సాంకేతికతను తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోడీ ధృక్పదానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌ల నాయకత్వ లక్షణాలకు, ప్రోత్సాహకానికి ధన్యవాదాలు.. ఇది కేవలం గూగుల్ ప్రాజెక్టు మాత్రమే కాదు… మా అందరి ప్రాజెక్టు.. దీంతో భారత్ ఏఐ ప్రయాణం ప్రారంభం అయింది.. దానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుంది..” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఇక, తన ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, ఆయా మంత్రులతో పాటు యంగేస్ట్ స్టేట్ హైయస్ట్ ఇన్వెస్టిమెంట్, గూగుల్ కమ్స్ టూ ఏపీ అనే హ్యాస్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు..

Exit mobile version