CM Chandrababu: తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ఇక, రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు.
Read Also: Love Cheating: డబ్బుల కోసం ప్రేమ వల.. రహస్యంగా పెళ్లి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్..
మరోవైపు.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనలో నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు హోం మంత్రి అనిత..
Read Also: MLC Election: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
కాగా, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి మిస్సింగ్.. విషాదాంతమైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన యువకుడు నాగరాజు అలియాస్ సుశాంత్… పాపను చంపి పూడ్చిపెట్టాడు. విచారణలో యువకుడు ఇచ్చిన సమాచారం ప్రకారం… పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లిన పోలీసులు… చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. వడమాలపేట మండలం ఏఎం పురానికి చెందిన పసిపాపకు.. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు యువకుడు నాగరాజు. పాప కనిపించకపోవడంతో… పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే కేసును చేధించారు. నిందితుడు నాగరాజును పట్టుకున్నారు. ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన ఎస్పీ సుబ్బారాయుడు… వడమాలపేట ఘటనలో మూడున్నర సంవత్సరాల చిన్నారి చంపింది.. ఆ చిన్నారి మామే అని తెలిపారు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్ లెట్ లు కోని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడు.. చిన్నారి హత్యపై అన్ని ఆధారాలు సేకరించామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం అన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు..