Site icon NTV Telugu

CM Chandrababu Serious: కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు సీరియస్‌.. రేపటి సమావేశం రద్దు..!

Cm Chandrababu Serious

Cm Chandrababu Serious

CM Chandrababu Serious: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు, ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని, ఇతర కృష్ణా జిల్లా నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో దుబాయ్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ఆ నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం.. దీంతో రేపటి టీడీపీ నేతల సమావేశం రద్దు చేశారట నేతలు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రేపటి సమావేశాన్ని పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు.. నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట..

Read Also: Deputy CM Pawan Kalyan: రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి రోడ్డు.. నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

కాగా, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య విభేదాలు ఎట్టకేలకు రచ్చకు ఎక్కాయి. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇద్దరు మధ్య వ్యవహారం.. ఇప్పుడు రోడ్ ఎక్కింది. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పి గానే మారారు.. ఆయన చేష్టలతో అధిష్టానం కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది.. దీనికి ప్రధానంగా ఎంపీ కేశినేని చిన్నికి అదే విధంగా కొలికపూడి శ్రీనివాస్ కి మధ్య గ్యాప్ రావటమే కారణం అనేది పార్టీ వర్గాల మాట. ఇప్పటికే రెండుసార్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ కొలికపూడి శ్రీనివాసుని పిలిపించి మీరు మార్చుకోవాలని చెప్పినా ఆయన మాత్రం తన తీరు మార్చుకోలేదు అనేది పార్టీ వర్గాల మాట ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆగ్రహానికి కూడా కొలికిపూడి ఇటీవల గురయ్యారు.. ఆ తర్వాత నుంచి ఆయన కొంత సైలెంట్ గా ఉన్నారు. అయినప్పటికీ ఆయనకి పెద్దగా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది ఎమ్మెల్యే వర్గం మాట.. ఈ సమయంలో ఎంపీ కేశినేని చిన్ని.. తిరువూరు నియోజకవర్గం బాధ్యతలు పూర్తిగా చేప్పట్టడం కూడా అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఎమ్మెల్యే కొలకపూడిపై అధిష్టానం ఆగ్రహంగా ఉండటంతో ఎంపీ కేశినేని చిన్ని స్థానికంగా పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎక్కువగా ఎంపీ వర్గంతోనే టచ్ లో కొనటంతో కొలికపూడికి మరింత మంట పుట్టించడంతోనే.. మరోసారి సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం.. దానిపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించడంతో.. మరోసారి కాక రేగడంతో.. చివరకు సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారట..

Exit mobile version