NTV Telugu Site icon

Free Bus Facility For Women: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇవాళ క్లారిటీ..!

Apsrtc

Apsrtc

Free Bus Facility For Women: అటు కర్ణాటక.. ఇటు తెలంగాణలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఇక, ఎన్నికల్లో హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ కూడా కసరత్తు చేస్తోంది.. త్వరలోనే ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు రవాణాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు.. అదే విధంగా రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.

Read Also: Prabhas: ప్రభాస్‌ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకొస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సిన అవసరం ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా.. మిగతావి అద్దె బస్సులు. మరోవైపు.. గతంలో 1,480 కొత్త బస్సుల కొనగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతూనే ఉన్నాయి.. ఇక, మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చారు.. మరో వైపు ఈ స్కీమ్‌తో ఆర్టీసీకి నెలకు రూ. 250-260 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం అంటే దాదాపు రూ.125 కోట్లు ప్రభుత్వం తీసుకుంటోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మాత్రం.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకపోవడంతో పాటు.. అదనంగా రూ.125-135 కోట్లు అదనంగా ప్రభుత్వమే.. ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది.. అయితే, రవాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తు్న్నారు.. నేటి సమీక్షలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.

Read Also: Fenugreek seeds: మెంతులు చూడడానికి అంతే ఉన్న తింటే మాత్రం బోలెడు ప్రయోజనాలు..

వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఇక, ఈ రోజు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. హోం శాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు చేయనున్నారు.. ఏపీలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చ. ఆస్పత్రుల్లో గొడవలు జరగ్గకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సమీక్ష. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రస్తావన తీసుకురానున్నారు.. అదే విధంగా.. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్-AP ANTF బలోపేతంపై చర్చించనున్నారు.. ఇసుక పాలసీ అమలుపై సమీక్షించనున్న సీఎం.. ఇసుక లభ్యత.. ఇసుక రవాణ ఛార్జీల నియంత్రణపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది.