Site icon NTV Telugu

CM Chandrababu: స్పేస్ పాలసీపై సీఎం సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu: 25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం.. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కూడా కల్పించనుంది.. విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉండాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. తుది పాలసీ రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు..

Read Also: Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..

కాగా, రక్షణ, అంతరిక్ష రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పాలసీ ఉండాలని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.. నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లనుంచి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాని పేర్కొన్నారు.. ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పాలసీ 4.0పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.. రక్షణ, ఏరోస్పేస్‌ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రబిందువుగా మారేలా ప్రయత్నించాలన్నారు. ఇక, ఈ రోజు స్పేస్ పాలసీ రూపకల్పనపై మరోసారి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు..

Exit mobile version