CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయార్జన శాఖలపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టెక్నాలజీ సహాయంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది రూ. 1 లక్షా 34 వేల కోట్లకు పైగా ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలన్నారు.. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.. ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులకు పన్ను వసూళ్లు, ఎగవేతదారుల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు..
Read Also: Droupadi murmu: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఇక, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు.. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉన్నప్పటికీ.. పన్ను ఆదాయంలో ఆ స్థాయిలో లేదు.. అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు.. ఇక, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణాశాఖ ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు..? హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి… మనకు ఆదాయం వచ్చే హైదరాబాద్ లాంటి నగరం లేనందున.. దానిని పూడ్చుకునే విధంగా పనిచేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు…
