Site icon NTV Telugu

CM Chandrababu: ఎయిర్‌పోర్టులపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా చేస్తామంటోన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్‌పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Upasana: బ్రెస్ట్ క్యాన్సర్‌ అవేర్నెస్ క్యాంపెయిన్ అంబాసిడర్ గా ఉపాస‌న

అయితే, విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించండి అని కేంద్ర పౌర విమానయాన శాఖకు సూచించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం డిజైన్లు విభిన్నంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.. విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై ఆరా తీశారు.. నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనం పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్‌గా పాల్గొన్నారు..

Exit mobile version