CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది.. కుప్పం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి పరిస్థితిపై చంద్రబాబు నాయుడు.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఇక, అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు.. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.. అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నంకు దగ్గరలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉండే విధంగా ఏర్పాటు జరగాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
Read Also: Chandan Gupta Murder Case: చందన్ గుప్తా హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితులకు జీవిత ఖైదు
మరోవైపు.. రాష్ట్రంలో మెట్రో రైల్ ప్రాజెక్టులపై గురువారం రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన సీఎం.. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం అయినా.. లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు సాయం చేయాలని విషయాన్ని వెల్లడించారు.. విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు సీఎం. విశాఖలో మొదటి దశలో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్ల మార్గంలో.. గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల పాటు డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు.. అయితే, నిన్న మెట్రో రైల్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణపై దృష్టిసారించారు..