NTV Telugu Site icon

CM Chandrababu: ఇంటింటికీ కుళాయి నీరు.. నేడు సీఎం కీలక సమీక్ష..

Cbn 2

Cbn 2

CM Chandrababu: రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ పై ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు.. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగు నీరు అందించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. అయితే, జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా గత ప్రభుత్వం పక్కని పెట్టిందనే విమర్శలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. తమ హయాంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది..

Read Also: IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లా.. ముగ్గురు పేసర్లతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే

మరోవైపు.. సెర్ఫ్ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.. డ్వాక్రా సంఘాలతో MSMEలు ఏర్పాటు చేయించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్ ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు.. ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్, రిలేషన్స్ పై రివ్యూ నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Show comments